డిమాండ్ల పరిష్కారానికి వినతి
హైదరాబాద్ : పెండిరగ్‌లో ఉన్న పలు డిమాండ్లను తీర్చడంతో పాటు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో విధులు నిర్వహించిన అధికారులకు అందించే రెమ్యూనరేషన్‌లో వ్యత్యాసాలను తొలగించాలని కోరుతూ తెలంగాణ గజిటెడ్ ఆఫిసర్స్ అసోసియేషన్ నాయకులు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కలిసి వినతిపత్రం అందజేశారు. పెండిరగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని, హెల్త్ కార్డులను అందించాలని అసోషియేషన్ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్యామ్, జాయింట్ సెక్రటరీ పరమేశ్వర్ రెడ్డి, ఎం.వి.రమణ, కిషన్, విజయలక్ష్మి నేతృత్వంలో ప్రతినిధి బృందం కోరింది.
ప్రధాన డిమాండ్లు ఇవే…
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిం చాలి. ఉద్యోగులు, పెన్షనర్లతో సహా ప్రభుత్వం సమాన కాంట్రిబ్యూషన్‌తో కూడిన ఎంప్లా యీస్ హెల్త్ స్కీంను అమలు చేయాలి. పెండిరగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలి. మే మాసంలో పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులు పదోన్నతులు పొందే విధంగా ఎన్నికల కమిషన్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. 2018 నుంచి పెండిరగ్‌లో ఉన్న ఉద్యోగుల బదిలీల జీవోను ఎత్తివేయాలి. ఆర్థిక శాఖలో పెండిరగ్‌లో ఉన్న ఉద్యోగుల అన్ని బిల్లులను వెంటనే విడుదల చేయాలి. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి కేటాయించిన 144 మందిని తెలంగాణకు తిరిగి కేటాయించిన ఫైల్‌కు సంబంధిం చి ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలి. 12.5 శాతం హెచ్‌వోడీ ఉద్యోగులను సెక్రటేరి యట్ సర్వీసులలోకి తీసుకునే జీవోను అమలు చేయాలి. 317 జీవోకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలి. కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు అదనపు కాడర్ స్ట్రెంత్‌ను మంజూరు చేయాలి. గోపనపల్లిలోని 101 ఎకరాల హౌస్ సైట్‌లకు చెందిన భూమిని అలియనేషన్ చేయాలి. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఉద్యోగులకు 24 శతం హెచ్‌ఆర్‌ఏ వర్తింపచేయాలి. ఐఆర్‌ను 5 శాతం నుంచి 20 శాతానికి పెంచాలి.