శ్రీ వాసవి తల్లి ఆత్మార్పణ దినోత్సవం ‘అధికారికం’పై కృతజ్ఞతలు

తాడికొండ, మహానాడు: ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం రాష్ట్రప్రభుత్వ అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించటం అమ్మవారి త్యాగానికి గౌరవించడమేనని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఇండస్ట్రీ కమిటీ చైర్మన్‌ అండ్‌ తాడికొండ నియోజక వర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు బుస్సెట్టి వెంకటేశ్వర రావు అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్యవైశ్యుల సెంటిమెంటును గౌరవించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. శ్రీ వాసవి మాత ఆశీస్సులు అందరికీ ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆనందసమయాన్ని ఆర్యవైశ్యులు అందరు కూడా పంచుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు.