దటీజ్ లోకేష్

సమస్య పరిష్కారం కాకుండానే అయినట్లు మెసేజ్
క్షమాపణలు చెప్పిన మంత్రి నారా లోకేష్
ఆధునిక రాజకీయాల్లో తొలి మార్పు

(అన్వేష్)

సహజంగా రాజకీయనాయకులు తాము చేయని పనులను సైతం చేసినట్లు ప్రచారం చేసుకుంటారు. మరొకరు చేసిన పనులను కూడా నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకునేందుకు ఏమాత్రం ఇబ్బందిపడరు. కానీ ఏపీలో యువమంత్రి లోకేష్ మాత్రం.. సమస్య పరిష్కారం కాకపోయినా అయినట్లు బాధితుడికి అధికారులు మెసేజ్ పెట్టినందుకు, తనను క్షమించాలంటూ పెద్దమనసుతో బహిరంగంగా ట్వీట్ చేశారు. రాజకీయాల్లో ఇదో కొత్తదనం. చిన్నవాడైనా పెద్దమనసుతో జరిగిన తప్పును అంగీకరించడమే కాకుండా, క్షమాపణ కూడా కోరడం ఆధునిక రాజకీయాల్లో కనిపించిన తొలి మార్పు.

ఏపీలో మురుగునీటి సమస్యపై ప్రజాదర్బార్లో ఫిర్యాదు చేస్తే.. పరిష్కారం కాకుండానే అయినట్లు అధికారులు మెసేజ్ పంపినట్లు ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. దీనికి మంత్రి నారా లోకేశ్ స్పందించారు. డిపార్ట్మెంట్ తరఫున ఆయన క్షమాపణలు చెప్పారు. త్వరలోనే తన టీమ్ సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి వేగంగా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.