Mahanaadu-Logo-PNG-Large

దర్శి ప్రాంత అభివృద్ధే లక్ష్యం

ఆడబిడ్డగా ఆదరించండి..సేవ చేస్తా
టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి

దర్శి, మహానాడు : దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి శనివారంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో కష్టాలను ఎన్నికల ప్రచారంలో చూశాను. తాళ్లూరు ప్రాంతంలో పాడి పరిశ్రమను ఆదుకుంటా..రామగుండం రిజర్వా యర్‌ను పూర్తి చేయించేలా కృషిచేస్తానని తెలిపారు. దర్శి ప్రాంతంలో తాగునీటి అవసరాలు తీరుస్తా. బెంగుళూరు, హైదరాబాదు ప్రాంతాలకు యువత వెళ్లకుండా దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ స్కూల్‌ను పూర్తి చేయించి పార్కులను సుందరీకరణ చేయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు నీటిని రప్పించి సాగర్‌ కుడికాలువ చివరి భూములకు అందేలా కాలువల మరమ్మతుల చేయిస్తామని హామీ ఇచ్చారు. దర్శి పట్టణంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి శాయశక్తులా కృషిచేస్తానని తెలిపారు. దొనకొండలో వలసలు నివారించి పారిశ్రామిక అభివృద్ధికి కృషిచేసి ఉపాధి అవకాశాలను కల్పిస్తాం. కురిచేడు, ముండ్లమూరు మండలాల్లో తాగునీటి కష్టాలు, రోడ్లు, డ్రైన్లు తదితర మౌలిక సదుపా యాల కల్పనకు తన వంతుగా కృషిచేస్తానని తెలిపారు.