– ఎంపీ పుట్టా మహేష్ కుమార్
ఏలూరు, మహానాడు: ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు అన్ని రకాల పంటలు పండించే రైతులకు గిట్టుబాటు ధర అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. దేవరపల్లి లో జరిగిన పొగాకు రైతుల అవార్డుల వేడుకలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు రైతులు వారి సమస్యలు చెప్పగా తక్షణం స్పందించిన ఎంపీ.. ఢిల్లీ లో కేంద్ర కామర్స్ మినిస్టర్ ను కలిసి రైతులు అదనంగా పండించిన పొగాకు పంట పై ఫెనాల్టీ రద్దు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అదనంగా పండించిన పొగాకు పంటకు ఫెనాల్టీ రద్దు చేస్తూ జీవో విడుదల చేసింది. ఈ సందర్బంగా రైతులు ఏలూరు వచ్చి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఘనంగా సత్కరించారు.
పొగాకు రైతు సంఘాల అధ్యక్షుడు పరిమి రాంబాబు, కరాటం రెడ్డి నాయుడు, కాకర్ల వివేకానంద లు మాట్లాడుతూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి వలన జిల్లాలో ఉన్న 15 వేల మంది పొగాకు రైతులు 15 కోట్లు, రాష్ట్రం లో ఉన్న లక్ష మంది పొగాకు రైతులు 110 కోట్లు లబ్ది పొందామన్నారు. ప్రతి ఏడాది దేశానికి 25 వేల కోట్లు నష్టం కలిగిస్తున్న నకిలీ సిగరెట్ల అక్రమ దిగుమతులను అరికట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. ఏ పని పట్టుకున్నా, అయేవరకు వదిలిపెట్టనన్నారు. రైతులను గుండెల్లో పెట్టుకుంటానని అన్నారు. నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశాను. రైతులకు గిట్టుబాటు ధర, యువతకు ఉపాధి, పోలవరం నిర్మాణం వేగవంతం, పోలవరం నిర్వసితులకు న్యాయానికి చేయాలని అడిగానన్నారు.
త్వరలో జరగనున్న కేంద్ర కేబినెట్ మీటింగ్ లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 12 వేల కోట్ల రూపాయల మంజూరు చేస్తున్నారని అన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో యువతకు ఉపాధి, రైతులకు గిట్టుబాటు ధర, పోలవరం, రైల్వే ప్రాజెక్టుల గురించి, మాట్లాడాను. ఏలూరు కు వందేభారత్ నిలుపుదల గురించి అడిగాను. సెప్టెంబర్ నెలలో ఏలూరు లో జాబ్ మేళా నిర్వహిస్తామని ఎంపీ తెలిపారు.
ఈ సమావేశంలో మాజీ శాసన సభ్యులు ఘంటా మురళీ, పొగాకు రైతు నాయకులు సత్రం వెంకట్రావు, కాకర్ల శేషుబాబు, జిల్లా నలుమూలల నుండి వందలాదిగా కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.