దర్శి ప్రాంత అభివృద్ధే కూటమి లక్ష్యం

-ప్రజల ఆదరణ చూస్తే ఆనందంగా ఉంది
-గెలిపించే బాధ్యత తీసుకుంటే ప్రజాసేవ చేస్తా
-కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి

ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు: దర్శి నియోజకవర్గం దొనకొండ మండలం ఆరవల్లిపాడు, తెల్లపాడు, నల్ల బూతులపాడు గ్రామ పంచాయతీలలో గురువారం ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. పొలాలకు డొంక రోడ్లన్నీ గ్రావెల్‌ రోడ్లుగా మారుస్తామని, తాగునీటి కష్టాలు తీర్చి మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి లక్ష్యమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో దర్శి ప్రాంతం అభివృద్ధిలో పరుగులు తీయనుందని తెలిపారు. ఈ ప్రాంతం అంతా మెట్ట ప్రాంతమని, సాగునీరు లేదు…తాగడానికి కూడా సరైన నీరు దొరకడం లేదని, కూటమి ప్రభుత్వం వస్తే ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వాలన్న లక్ష్యంతో మన ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతుందన్నారు.

నవరత్నాల పేరుతో దోపిడీ చేసే తత్వం చంద్రబాబుకు లేదన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావటం, ప్రతి గ్రామంలో మహిళల ఆదరణ చూస్తే ఆనందంగా ఉందన్నారు. నాడి పట్టిన డాక్టర్‌గా దర్శి ప్రాంత సమస్యలు తెలుసుకున్నాను…నన్ను గెలిపించే బాధ్యత తీసు కుంటే మీ ఆడబిడ్డగా ఒక సేవకురాలిగా ఇక్కడే ఆసుపత్రి నిర్మించి ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. ఈ ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు, కమ్మ వెంకట సుబ్బులు, నాగులపాటి గాలెమ్మ,