Mahanaadu-Logo-PNG-Large

రాష్ట్రంలో కూటమికి 25 పార్లమెంట్‌ స్థానాలు

కూటమి గెలుపుతోనే వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌
జగన్‌ పాలనలో అన్ని వర్గాలకు ఇబ్బందులు
మోడరన్‌ లాలూ యాదవ్‌ లాగే ఆయన పాలన
మతప్రాతిపదికన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం
ఈడబ్ల్యూఎస్‌ కోటాలో అగ్రవర్ణ ముస్లింలకు రిజర్వేషన్లు
కేంద్ర మాజీ మంత్రి షానవాజ్‌ హుస్సేన్‌

విజయవాడ, మహానాడు : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం కేంద్ర మాజీ మంత్రి షానవాజ్‌ హుస్సేన్‌ విలేఖ రుల సమావేశంలో మాట్లాడారు. ఏపీలో 25 పార్లమెంటు స్థానాలు బీజేపీ కూటమి గెలుస్తుంది. 272 ప్లస్‌ అని 2014లో అన్నపుడు 283 ఇచ్చారు, 300 ప్లస్‌ అని 2019 లో అన్నపుడు 329 ఇచ్చారు.. ఇప్పుడు 400 ప్లస్‌ అంటున్నాం. ఏ రిజర్వేషన్‌కు మేం వ్యతిరేకం కాదని, మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశా రు. ఈడబ్ల్యూఎస్‌లో ముస్లిం అగ్ర కులాలకు కూడా రిజర్వేషన్‌ ఉంటుందని తెలిపారు. మోడరన్‌ లాలూ యాదవ్‌ లాగా ఇక్కడ మద్యం, ఇసుక, మైనింగ్‌ జరుగుతున్నాయి. ఏపీలో మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌ను వికసిత్‌ రాష్ట్రంగా ఉంచ టానికి డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాల్సిన అవసరం ఉందని, మోదీ గ్యారంటీ, బాబు ష్యూరిటీ, పవన్‌ కమిట్మెంట్‌తో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నా రు. కాంగ్రెస్‌, వైసీపీ రెండు పార్టీలు ఒకటే సిద్ధాంతంతో పనిచేస్తున్నాయని తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనాచౌదరిని గెలిపిస్తే విజయవాడ అభివృద్ధి చేసి చూపిస్తారని వ్యాఖ్యానించారు. కూటమి గెలిస్తే గుజరాత్‌, రాజస్థాన్‌ ఏ విధంగా అభివృద్ధి చెందాయో ఆంధ్రప్రదేశ్‌ను కూడా అలాగే అభివృద్ధి చేసి చూపిస్తారని తెలిపారు. రాష్ట్రంలో జగన్‌ పాలనతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేజ్రీవాల్‌ ప్రచారం చేసుకోవడానికి మాత్రమే బెయిల్‌ పొందారు. కేజ్రీవాల్‌కి ఇచ్చింది భారతరత్న కాదు.. జైల్‌రత్న…అంత ఎగిరెగిరి పడొద్దని హెచ్చరించారు.

పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదేళ్లలో నియంత పాలన సాగిందన్నారు. పేరుకే డిప్యూటీ సీఎంలను నియమించి వారికి పదవి మాత్రమే అలంకారప్రాయంగా ఉండేలా చేశారు. జగన్‌ రాజకీయ నాయకులను మొత్తం భూస్తాపితం చేసి అవినీతి పాలన చేశాడు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమికి ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇప్పటికీ అభివృద్ధి చేయకపోవటం చాలా దురదృష్టకరమన్నారు. కొండ ప్రాంతాలలో నివసించే ప్రజలు, వారి జీవన విధానం చాలా కష్టతరంగా ఉంది. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లు ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. ఆధ్యాత్మిక క్షేత్రం దుర్గగుడిని అభివృద్ధి చేయలేకపో యారు. వెండి సింహాలు మాయం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపి స్తాం. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ పేరుతో జగన్‌ ప్రజలను మోసం చేస్తున్నారు. వాలంట ీర్లను ఎలా మోసం చేశాడో అలాగే ఈ యాక్ట్‌ పేరుతో ప్రజలను మోసం చేయటానికి సిద్ధమయ్యారని విమర్శించారు. ఈ సమావేశంలో మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ బాజీ, ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌, వల్లూరు జయప్రకాష్‌, యామినీ శర్మ, కిలారి దిలీప్‌, జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, యాళ్ల దొరబాబు, మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ బాషా, ఖుద్దూస్‌, వాసిరెడ్డి చైతన్య, రఫీ తదితరులు పాల్గొన్నారు.