Mahanaadu-Logo-PNG-Large

కూటమి ఘన విజయం ఖాయం

జూన్‌ 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం
వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు

వినుకొండ, మహానాడు : రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించడం, జూన్‌ 12న ముఖ్యమంత్రిగా చంద్రబా బు ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని వినుకొండ కూటమి అభ్యర్థి జీవీ ఆంజనే యులు ధీమా వ్యక్తం చేశారు. కనీసం 155-160 సీట్లు గెలిచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుందని స్పష్టం చేశారు. శనివారం చివరిరోజు వినుకొండలో ఆయన ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మక్కెనతో కలిసి ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొన్నారు. పలు వార్డుల్లో ప్రచార రథంతో రోడ్‌షో నిర్వహించారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలును ఆశీర్వదించాలని కోరారు.

బొల్లా అహంకారాన్ని దించబోతున్నారు

పాలించమని ప్రజలు పట్టం కడితే అధికారం అడ్డం పెట్టుకుని భూకబ్జాలు, దౌర్జన్యాలు దుర్మార్గాలు చేస్తూ ప్రజల పట్ల అహంకారంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనా యుడు అహంకారాన్ని ప్రజలు దించబోతున్నారని జి.వి.ఆంజనేయులు అన్నారు. శనివా రం సాయంత్రం పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటమి భయంతో ఎన్నికల సజావుగా జరగకుండా అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నా రని, కేంద్ర బలగాలను పెంచి వినుకొండలో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు.