– బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ
విజయవాడ, మహానాడు: వక్ఫ్ చట్టం వల్ల అన్యాయం జరుగుతుందని, ఈ బిల్లు ని మద్దతు ఇవ్వకండి అంటూ కేవలం ఎన్డీయే వ్యతిరేక శక్తులే గగ్గోలు పెడుతున్నాయని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు పేద బలహీన ముస్లిమ్స్ కు చెందాలని ప్రధాని మోదీ వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చారు. ముస్లిం అభ్యున్నతి కోసం వక్ఫ్ ఆస్తి పేద ముస్లిమ్స్ కి చెందేలా చట్టం రూపొందించటం మంచి పరిణామం. వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం జరుగుతున్న నేపథ్యంలోనే ఈ చట్టం అమలులోకి తీసుకొచ్చారు. జన్ ధన్ ఖాతా, ముద్ర యోజన, ఇలా మహిళల సంక్షేమ పథకాలలో ముస్లిమ్స్ మహిళలు లబ్ధి చేకూరుతోంది.
ప్రధాని మోదీ తేనున్న ఈ చట్టం తో ప్రతి పేద ముస్లిం కి వక్ఫ్ ఆస్తులు మీద హక్కు ఉంటుంది. ట్రిపుల్ తలాక్ చట్టం రద్దు తో ముస్లిం మహిళలకు కుటుంబ పెద్దగా నిలిచారు. జగన్ ప్రభుత్వం లో వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయి. గత జగన్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ముస్లిమ్స్ కి ఈ ఆస్తులు అందని ద్రాక్ష చేశారు. గత ప్రభుత్వంలో పెత్తందారులు వక్ఫ్ ఆస్తులని పేదలకు చెందకుండా అవకతవకలక పాల్పడ్డారు. ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రధాని మోదీ ముస్లిమ్స్ కి అండగా నిలుస్తున్నారు. దేశం కోసం, ప్రజల కోసం, దేశ అభ్యున్నతి కోసం నిరంతరం ప్రధాని మోదీ కష్ట పడుతున్నారు.