జేసీవీ రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి
గుంటూరులో ఘనంగా బుద్ధ జయంతి
బుద్ధ జయంతిలో వక్తలు
గుంటూరు, మహానాడు : దేశం ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యల పరిష్కారానికి బుద్ధుడి మార్గం అనుసరణీయమని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. గుంటూరు విజేత కాన్సెప్ట్ స్కూలులో గురువారం బుద్ధ జయంతి వేడుకలు నిర్వహించారు. సభకు సెంటర్ ఫర్ సోషల్ సైకాలజీ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎన్.అరవింద్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా లక్ష్మణరెడ్డి ప్రసంగించారు. బౌద్ధ మతం నేడు ప్రపంచంలో నాలుగో మతంగా కొనసాగుతుందని, ప్రపంచ జనాభాలో ఏడు శాతం మంది బౌద్ధ ధర్మాన్ని ఆచరిస్తున్నారన్నారు. బుద్ధుని బోధనలో పంచశీల ముఖ్యమైంద ని, ప్రాణహాని చేయరాదని, దొంగతనం ఉండరాదని, అబద్ధ మాడరాదని, వ్యభిచారాన్ని నివారించాలని, మత్తు పానీయాలను నిరోధించాలని 2,600 ఏళ్ల క్రితమే పేర్కొన్నాడని తెలిపారు. ప్రొఫెసర్ ఎన్.అరవింద్ ప్రసంగిస్తూ సామా జిక అంతరాలకు ఆనాడే బుద్ధుడు పరిష్కారం చూపించారని, మూఢ నమ్మకా లకు వ్యతిరేకంగా ప్రజలను జాగృతం చేశారని పేర్కొన్నారు.
వ్యక్తిత్వ వికాస నిపుణులు, స్టెప్ వ్యవస్థాపకుడు ప్రత్యూష సుబ్బారావు బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మానవత చైర్మన్ పావులూరు రమేష్, ఏపీ రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యదర్శి డి.దేవ రాజ్, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓ.నారాయణరెడ్డి, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు మధు, పిరమిడ్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు వెలగపూడి లక్ష్మణరావు, భారత్ బచావో జిల్లా అధ్యక్షుడు బత్తుల కోటేశ్వరరావు, రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు రామమోహన్‌రావు, స్టెప్ ప్రిన్సిపాల్ బత్తుల కృష్ణయ్య, మేలుకో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి సేతు రామేశ్వరరెడ్డి, ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యద ర్శి టి.వీరయ్య, వివిధ విద్యాసంస్థలకు చెందిన ఈదర గిరీష్, ఎం.విజయలక్ష్మి, కొరటాల శ్రీవల్లి, డి.ప్రసాద్, మహిళా నేతలు వై.సమత, కె.పావని, ఎం.పద్మరాణి పాల్గొన్నారు.