కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి కట్టుబడి ఉంది

– ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌

రాజమహేంద్రవరం : కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి కట్టుబడి ఉందని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) పేర్కొన్నారు. గురువారం 7, 8, 13, 14, 15 డివిజన్లకు సంబంధించి అంబేద్కర్‌ నగర్‌ వెలుగు పార్కు వద్ద ‘‘ఇది మంచి ప్రభుత్వం’’ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీల్లో పింఛన్లు పెంపు కార్యక్రమం వెంటనే చేపట్టినట్లు చెప్పారు.

గత ప్రభుత్వం ఐదేళ్లలో పింఛన్లు దఫదఫాలుగా పెంచిందని, కూటమి ప్రభుత్వం వెంటనే పెంచి పేదలను ఆదుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా మహిళలకు సంక్షేమ పథకాలు అమలులో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు వేగంగా జరుగుతాయని వివరించారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తప్పక అమలు చేస్తుందన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల, ల్యాండ్‌ టైటిలింగ్‌ రద్దు వంటివి చేశామన్నారు. వరదల్లో నష్టపోయిన వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుందన్నారు. దీపావళి నుంచి ఉచితంగా మూడు గ్యాస్‌ బండలు కార్యక్రమం ప్రారంభించ డానికి సీఎం చంద్రబాబు కృషిచేస్తున్నారని చెప్పారు.

గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని, కూటమిప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర పుననిర్మాణం జరుగుతోందన్నారు.రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యర్రా వేణు గోపాలరాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని మరలా ప్రగతిపథంలోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఆయనకు అండగా ఉంటారన్నారు.

రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌ కుమార్‌, టిఎన్‌టియూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు, రాజమండ్రి పార్లమెంట్‌ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, నగర పాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.