రెండు స్థానాల్లో అభ్యర్థుల ఉపసంహరణ
స్వాగతించిన టీడీపీ నేత వర్ల రామయ్య
విజయవాడ: రాష్ట్రంలో కూటమికి బేషరతు మద్దతు ఇస్తున్నట్లు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత, కేంద్రమంత్రి రాందాస్ అత్వాలే ప్రకటించారు. శనివారంలో విజయ వాడలోని ఐలాపురం కన్వెన్షన్ సెంటర్‌లో తెలుగుదేశం, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాలు ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ తరపున పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ కూటమికి మద్దతు తెలపడానికి వచ్చిన కేంద్రమంత్రి రామ్‌దాస్ అత్వాలేకు కృతజ్ఞతలు తెలిపారు. అత్వాలే మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమికి మద్దతు తెలిపి విజయంలో భాగస్వాములు కాబోతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. విజయవాడ పార్లమెంటు అభ్యర్థి పేరం శివనాగేశ్వర్‌రావు గౌడ్, అమలాపురం పార్లమెం ట్ అభ్యర్థి కాపా కళ్యాణ్ అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌పీఐ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్య క్షుడు కోడూరి అఖిల్ తదితరులు పాల్గొన్నారు.