దేశం పారిశ్రామిక దిగ్గజాన్ని కోల్పోయింది

విజయవాడ, మహానాడు: రతన్ టాటా ఇక లేరన్న విషయం తెలుసుకుని పారిశ్రామిక రంగం శోకసంద్రంలో మునిగిపోయింది…. భారత దేశం విలువలతో కూడిన పారిశ్రామిక దిగ్గజాన్ని కోల్పోయిందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి చెందిన పలువురు నేతలు విచారం వ్యక్తం చేశారు. రతన్ టాటా జాతీయ వాది, గొప్ప మానవతా వాదిగా వారు పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, రాష్ట్ర మంత్రి వై.సత్య కుమార్ ఎక్స్‌ వేదిక గా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.