లంక గ్రామాల్లో చావు కష్టాలు!

– మృతదేహాన్ని పీకల్లోతు నదిపాయను దాటించి అంత్యక్రియలు

అంబేద్కర్ కోనసీమ, మహానాడు: పి.గన్నవరంలో వరద ముంచెత్తడంతో లంక గ్రామాల్లో చావు కష్టాలు పుడుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చనిపోయిన వ్యక్తిని చేతులతో ఎత్తుకొని గోదావరి నది పాయను బంధువులు దాటించారు. దాటిన బందువులు. పి.గన్నవరం మండలం కత్తుల వారి పేటకు చెందిన మట్ట లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందారు. కత్తుల వారి పేట నుండి జిల్లేడు లంకలో ఉన్న శ్మశాన వాటికకు తీసుకెళ్ళేందుకు గోదావరి నది పాయలో దిగి, మృతదేహాన్ని మోసుకెళ్ళారు. గోదావరి వరద మరోసారి లంక గ్రామాలను ముంచెట్టడంతో నది పాయలో దిగి చేతులు పైకి ఎత్తి పీకల్లోతు నీటిలో తీసుకువెళ్ళారు. అవతల అంత్యక్రియలు నిర్వహించారు. వరదల వచ్చిన సమయంలో ఎవరైనా చనిపోతే లంక గ్రామాల ప్రజలకు ఇవే కష్టాలు ఎదురవుతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.