ఓడిన వైసీపీ అభ్యర్థి ఇంటికెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు

మడకశిర: ఇటీవల ఎన్నికల్లో తన చేతిలో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి ఈర లక్కప్ప ఇంటికి మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వెళ్లారు. ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. రాజకీయాలు ఎన్నికలప్పుడు మాత్రమేనని, ఆ తర్వాత అందరూ ప్రజల కోసం కలిసి పనిచేయాలని అభిప్రాయపడ్డారు. పాలిటిక్స్ లో ఇలాంటి సానుకూల వాతావరణం ఉండాలని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ సెగ్మెంట్లో కేవలం 350 ఓట్ల తేడాతో లక్కప్ప ఓడిపోయిన విషయం తెలిసిందే.