Mahanaadu-Logo-PNG-Large

రాష్ట్రానికి పట్టిన గ్రహణం జూన్‌ 4న వీడనుంది

స్థానిక సంస్థలకు మంజూరైన నిధులు దారిమళ్లించారు
ఈ ఎన్నికల్లో జగన్‌రెడ్డికి తమ సత్తా చూపించాం
చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని దేవుళ్లను మొక్కుకున్నా
పీఆర్‌ చాంబర్‌ అధ్యక్షుడు, టీడీపీ నేత వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌

శ్రీకాళహస్తి, మహానాడు : ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని భగవంతుడిని కోరుకున్నట్లు పీఆర్‌ చాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ నేత వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. తిరుమల శ్రీవారు, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి, శ్రీకాళహస్తిలోని పరమశివుడిని ఆయన దర్శించుకున్నారు. రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడి మంచిరోజులు రావాలని మొక్కుకున్నారు. ఆదివారం శ్రీకాళహస్తిలో స్వామివారి దర్శనం అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పంపించిన ఆర్థిక సంఘాల నిధులు రూ.8629 కోట్లను జగన్‌ ప్రభుత్వం దిగమింగిందని తెలిపారు.

దానిపై పంచాయతీరాజ్‌ చాంబర్‌, రాష్ట్ర సర్పంచుల సంఘాల ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేసినా జగన్‌ స్పందించక పోవడంతో ఈ ఎన్నికల్లో తమ తడాఖా చూపించామని, దాని ఫలితం జూన్‌ 4న తెలుస్తుందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కొత్తగా రెండునెలల క్రితం రాష్ట్రాని కి పంపించిన రూ.988 కోట్లను చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి గ్రామ పంచాయ తీలకు విడుదల చేయకుండా దారి మళ్లించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే ఆ నిధులను గ్రామపంచాయతీలకు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సమా వేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ చాంబర్‌, సర్పంచుల సంఘం నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, చొక్కా ధనుంజయ యాదవ్‌, కిరణ్‌, రవి, ప్రకాష్‌ నాయుడు, కుప్పాల మురళి తదితరులు పాల్గొన్నారు.