అండగా నిలిచిన ఓటర్లకు కృతజ్ఞతలు
దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి
దర్శి, మహానాడు : వైసీపీ దాడులకు ఎదురొడ్డి నిలబడి పార్టీ శ్రేణులు, ఓటర్లు ఓటేసి అండగా నిలవడం మరిచిపోలేనని దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి కొనియాడారు. మంగళవారం కూట మి నాయకులు, కార్యకర్తలు ఆమెను కలిసి అభినందించారు. అనంతరం లక్ష్మి మాట్లాడు తూ కూటమి కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో కొన్ని ఘటనలు జరిగినా శాంతియుతంగా ఎదుర్కొన్నట్లు తెలిపారు. బొట్లపాలెం గ్రామంలో పార్టీ వారిని ఓటేయకుండా బీసీలపై దాడులు చేసి గాయపరిచి ఏజెంట్లను లాగి పడేశారని, కత్తితో దాడి చేసేందుకు యత్నిం చారని తెలిపారు.
దర్శి పట్టణం కురిచేడు రోడ్డులో రిగ్గింగ్‌కు యత్నించిన వారిని అడ్డుకున్న మా కార్యకర్తలపై వైసీపీ అభ్యర్థి శివప్రసాద్‌రెడ్డి సమక్షంలో దాడులకు తెగబడ్డారు. పోలీసులు వారి ఆగడాలను ఆపడంలో విఫలమయ్యారని విమర్శించారు. తనకు సహకరించిన ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి, అన్న రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, పిచ్చయ్య, పమిడి రమేష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.