జూన్ 4న రాష్ట్రంలో కొత్త శకం ఆరంభం
వైసీపీకి తొత్తులైన పోలీసులను వదిలేది లేదు
చట్టపరంగా శాశ్వతంగా ఇంటికి పంపిస్తాం
ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లిని అరెస్టు చేయలేదు
గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు
గురజాల, మహానాడు : పల్నాడు జిల్లా గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలింగ్ రోజు రెంటచింతల మండలం పాల్వాయి గేటులో ఈవీఎం పగలగొట్టినా ఇంతవరకు మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయకపోవడం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనమని, ఎన్నికల సంఘం ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుందన్నారు. ఐదేళ్ల అరాచకానికి, వైసీపీ ప్రభుత్వానికి ముగింపు సమయం దగ్గర పడిరదని వ్యాఖ్యానించారు. జూన్ 4న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త శకం ఆరంభం కానుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని స్పష్టం చేశారు.
పోలీసులపై దర్యాప్తు చేయించి చర్యలు తీసుకుంటాం
ఐదేళ్ల పాలనలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. కొంతమంది అధికా రులు నిజాయితీగా పనిచేసినా కొంతమంది పోస్టింగుల కోసం బరితెగించి పోలీసు శాఖకే మచ్చ తెచ్చే పరిస్థితికి తీసుకువచ్చారు. దాంట్లో చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉండటం కూడా దురదృష్టకరం. వ్యవస్థలను రక్షించాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ లే ‘‘జీ హుజూర్’’ అని ఒక క్రిమినల్ ముందు, జైలుకి పోయి వచ్చిన వ్యక్తి ముందు మోకరిల్లటం ప్రజాస్వామ్యానికి మచ్చ. గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో ఎవరైతే పోలీసులు వైసీపీ ఎమ్మెల్యేలకు వత్తాసు పలికారో వారిపై దర్యాప్తు చేయించి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
తప్పుడు కేసులు పెట్టి కొట్టారు
నియోజవర్గంలో కొంతమంది పోలీసులు వైసీపీకి తొత్తులుగా మారి ఇష్టారా జ్యంగా తప్పుడు కేసులు పెడుతున్నారు. తంగెడ గ్రామంలో ఏకంగా పోలింగ్ బూత్‌ల మీదే బాంబులు వేస్తే టీడీపీ వాళ్ల మీద 307 కేసు పెట్టడం విడ్డూరం. అదేవిధంగా మాదినపాడు గ్రామంలో కార్యకర్తలను కొట్టడం, కొత్తపాలెం, మోర్జంపాడు గ్రామాల్లో తప్పుడు కేసులు పెట్టి కొట్టడం దేనికి సంకేతమో ఆ కొట్టిన ఎస్‌ఐ, సీఐ చెప్పాలి. జూన్ 4 తర్వాత అసలైన పోలీసులను మీరు చూ స్తారు. పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చిన అధికారులను శాశ్వతంగా ఇంటికి పంపి స్తాం. సిట్ దర్యాప్తు కూడా సక్రమంగా జరగాల్సిన అవసరం ఉంది.
వాళ్లను వదిలే సమస్యే లేదు
రాష్ట్ర భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టిన జగన్ జైలుకు పోవడం ఖాయం. అడ్డగోలుగా వ్యవహరించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటివాళ్లు, కాసు మహేష్ రెడ్డి లాంటి వాళ్లు ఇంటికి పోవడం ఖాయం. ఇలాంటి వ్యక్తులను నమ్ముకుని పోలీసులు పోస్టింగుల కోసం బరితెగిస్తే మూల్యం చెల్లిస్తారని చెప్పాం. ఈరోజు అదే జరుగుతుంది. మిమ్మల్ని అడ్డం పెట్టుకుని అక్రమాలు చేసిన వాళ్లు పరార య్యే పరిస్థితిలో ఉన్నారు. జూన్ 4 తర్వాత మిమ్మల్ని ఎవరు రక్షిస్తారో కూడా ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. కార్యకర్తలపై నోరుపారేసుకున్న, చేయి చేసుకున్న వాళ్లను వదిలే సమస్య లేదు.