పింగళి తయారు చేసిన పతాకం.. జాతికే గర్వకారణం

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, త్రివర్ణ పతాక రూపకర్త స్వర్గీయ పింగళి వెంకయ్య 148వ జయంతిని పురస్కరించుకొని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు.. వెంకయ్య గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడి సాయిపురం కాలనీలో వెంకయ్య మనుమరాలు మునిపల్లి ఛాయదేవి స్వగృహంలో ఆమెను శాలువాతో సత్కరించి పింగళి వెంకయ్య గారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఛాయాదేవి గారిని సత్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. మహాత్మా గాంధీజీ సూచనపై ఆకుపచ్చ, కాషాయ రంగులుతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించారన్నారు. మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్ఫురింపజేస్తుందన్నారు. కార్మిక, కర్షకులపై ఆధారపడిన భారతదేశం, సత్య హింసలను ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం. ఆ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.