Mahanaadu-Logo-PNG-Large

బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది

– టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌

తోట్లవల్లూరు, మహానాడు: వరద బాధితులకు తెలుగుదేశం పార్టీ(టీడీపీ), ప్రభుత్వం అండగా ఉంటుందని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.వి.బి రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం పామర్రు నియోజకవర్గం, తోట్ల వల్లూరు గ్రామ ప్రజలకు, పునరావస కేంద్రాల్లోని బాధితులను పరామర్శించారు. రొట్టెలు, బిస్కెట్స్, వాటర్ బాటిల్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కృష్ణానది వరద కారణంగా లంక గ్రామాల ప్రజలు వారి ఇళ్ళు, వాకిళ్లు, పొలాలు మునిగిపోయి ఐదు రోజులుగా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరదలు వచ్చినప్పటి నుంచి విజయవాడలోనే బాధితులకు అండగా ఉంటూ, ఒక సోల్జర్ లాగా పనిచేస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వీరపనేని శివరాం, రాష్ట్ర బీసీ ఫెడరేషన్ల ప్రధాన కార్యదర్శి విరంకి గురుమూర్తి, రాష్ట్ర సగర సాధికార కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సయ్యద్ అజ్మతుల్లా, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి రాజులు పాటి ఫణి, ఆచంట కోటి బాబు, ఉప్పులూరి గోపాల కృష్ణ, లుక్క రేణుకా రావు, వెంకటేశ్వరరావు, బాబూరావు, మాజీ సర్పంచ్ జక్క శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.