సాధారణ పరిస్థితులు వచ్చే వరకూ ప్రభుత్వం అండగా ఉంటుంది

  • ఆకలి, దప్పుులు లేకుండా అందరినీ ఆదుకుంటాం
  • చంద్రబాబు ముందుచూపు, అనుభవంతో ప్రాణ నష్టం నివారించగలిగాం
  • భవానీపురం వరద ప్రాంతంలో ట్రాక్టర్ పై ప్రయాణిస్తూ హోంమంత్రి ఆహారం పంపిణీ

అమరావతి; వర్షాభావ స్థితిగతుల నుంచి సాధారణ పరిస్థితులకు చేరే వరకూ ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఆకలిదప్పులకు ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటామని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం నుంచే భవనీపురం లలితానగర్ ప్రాంతంలో ముంపు ప్రాంతంలోని ప్రజలకు ఆహార పొట్లాలు, నీరు పంపిణీ చేశారు. మోకాళ్లలోతు పైన ఇంకా నీరు నిలిచి ఉండడంతో ట్రాక్టర్ పైన ప్రయాణం చేస్తే ఆ కాలనీ వాసులకు ఆహారం పంచారు. చిన్నారులు, మహిళలు, ప్రత్యేక ఇబ్బందికర పరిస్థితులున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు ముందుచూపు, అనుభవంతో ప్రాణ నష్టం లేకుండా బయటపడగలిగామన్నారు. నీరు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందించడంపైన ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఆమెతో పాటు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పాల్గొన్నారు.