– ఏపీ జేఏసీ ప్రతినిధులు బొప్పరాజు, పలిశెట్టి
అమరావతి, మహానాడు: రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి దీర్ఘకాలంగా పెండింగు ఉన్న తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల బదిలీలపై ఉన్న చిక్కుమూడిని విప్పి కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సానూకూలంగా స్పందించడం హర్షణీయమని ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్టేట్ సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావులు పేర్కొన్నారు. ఈ మేరకు వారు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వం జిఓ నంబర్ 1422 జీఏ (ఎస్పీఎఫ్, ఎంసీ) విడుదల చేయడపట్ల ఏపిజెఏసి అమరావతి రాష్ట్రకమిటీ తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
రాష్ట్ర విభజన అనంతరం, కమలనాధన్ కమిటీ సిఫారసుల మేరకు చట్టబద్ధంగా ఆంధ్రా లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తిరిగి తెలంగాణ రాష్ట్రానికి పంపమని సిఫారసు చేసినప్పటికీ, గత అనేక సంవత్సరాలుగా టీఎన్జీవో సంఘం పక్షాన కోరుతున్నప్పటికి, ఎంతో కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆమోదం కొరకు ఎదురుచూస్తున్న నేపథ్యంలో, ఈ బదిలీల సమస్య పరిష్కారం కోసం ఏపిజేఏసి అమరావతి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణా ఎన్.జి.ఓ నాయకత్వన్ని కలుపుకొని, నూతనంగా ఏర్పడిన తర్వాత ఏపి ప్రభుత్వ పెద్దలకు, ఉన్నతాధికార్లుకు పలు లేఖలు ఇచ్చి కృషిచేయడం విశేషమన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల ద్వారా వారికి తెలిసిన వెంటనే స్పందించి, దీర్ఘకాలికంగా వారి వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అయిన 122 మంది తెలంగాణ ఉద్యోగులను తిరిగి వారి సొంత తెలంగాణ రాష్ట్రానికి పంపుతూ నేడు ఉత్తర్వులు ఇచ్చి, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కళ్లల్లో ఆనందాన్ని నింపారన్నారు.
ఈ ఉత్తర్వులు జారీ చేయడంలో ఏపీ జేఏసీ అమరావతి కి సంపూర్ణంగా సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, , సిఎం ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్రకి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కార్యదర్శి పోలా భాస్కర్, ఇతర పెద్దలకు, అధికారులకు ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాని పేర్కొన్నారు.