ఇసుక స్టాక్ పాయింట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి 

కొల్లిపర, మహానాడు:  గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి ఇసుక స్టాక్ పాయింట్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక స్టాక్ పాయింట్ లో ఇసుక రవాణా ఎలా జరుగుతుందని, వినియోగదారులకు అందుతున్న విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉచిత ఇసుక పంపిణీ పై ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి ఆదేశించారు. వినియోగదారులకు ఇసుక అందుబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి సూచించారు.