– మంత్రి సవిత
గుంటూరు, మహానాడు: కొత్తపేటలో ఉన్న యడవల్లి వారి బ్రాహ్మణ సత్రాన్ని మంత్రి సవిత గురువారం సందర్శించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయంలో బ్రాహ్మణ సంఘ నేతలతో, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బ్రాహ్మణ కుటుంబాలకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని, దీనికి ఉన్న మూడు ఎకరాల స్థలాన్ని పరిశీలించి రాబోయే రోజుల్లో బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధి కోసం మాత్రమే దీన్ని వినియోగిస్తామని హామీ ఇచ్చారు. యడవల్లి వారి బ్రాహ్మణ సత్రం ఆస్తులు గతంలో అన్యాక్రాంతం కావడం, కోర్టు కేసులు, మున్సిపల్ కార్పొరేషన్ బకాయిలపై అధికారులతో మాట్లాడారు. జీఎంసీ, బ్రాహ్మణ కార్పొరేషన్ వివాదం పరిష్కరించాలని కలెక్టర్ నాగలక్ష్మికి ఫోన్లో ఆదేశించారు.
మహిళలపై అత్యాచారాలు వైసీపీ ప్రభుత్వం లో పెట్టింది పేరని, శవ రాజకీయలు చేయడంలో దిట్ట! హూ కిల్డ్ బాబాయ్..? 2027మంది మహిళలపై గతంలో అఘాయిత్యాలకు జరిగిన సంగతి జగన్మోహన్ రెడ్డికి గుర్తులేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 5సం. లు నవరత్నాల పేరుతో దోచుకువడం, దాచుకోవటమే ధ్యేయంగా వైసీపీ పనిచేసిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా పేద బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరేలా చేశారని, గత ఐదేళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించలేదని విమర్శించారు.
బ్రాహ్మణుల సంక్షేమాన్ని కూడా మోసం చేశారని, బ్రాహ్మణ అర్చకులపై దాడులు జరిగిన కూడా పట్టించుకోలేదని, అర్చకులు సమస్యలు పరిష్కరించకుండా అలానే తాత్సర్యం చేశారని, చంద్రబాబు ప్రభుత్వం రాగానే అర్చకులకు వేతనం 15,000 రూ.లు పెంచడంతోపాటు, ధూప దీప నైవేద్యాల పథకం కింద 10,000 రూ.లు ఇవ్వటం ప్రారంభించారని, ట్రస్ట్ బోర్డులో బ్రాహ్మణులకు కూడా అవకాశం కల్పిస్తున్నారని, బ్రాహ్మణులు కోల్పోయిన పూర్వవైభవాన్ని మరల చంద్రబాబు ప్రభుత్వంలో తీసుకువచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి తమను ఆదేశించారని తెలిపారు. దానిలోని భాగంగానే యడవల్లి వారి బ్రాహ్మణ సత్రాన్ని సందర్శించినట్టు చెప్పారు. మంత్రి పర్యటనలో పాల్గొన్న సత్రం కన్వీనర్ అండ్ ఈవో సుభద్ర, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ మాజీ కో ఆర్డినేటర్ సిరిపురపు శ్రీధర్ శర్మ, తదితర కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.