ఎంతో అభివృద్ధి చేశా..ప్రజలతోనే ఉన్నా
ఓటమికి కారణం అంతుచిక్కడం లేదు…
ప్రజలతో మమేకమవడం మేము చేసిన తప్పా?
కూటమి హామీలకు ప్రజలు మోసపోయారా?
కాపుల కష్టాలను పట్టించుకోని వారు హీరోలయ్యారు
కన్నతల్లికి ఒంట్లో బాగోకపోయినా ప్రజల కోసం పనిచేశా
ఏదిఏమైనా వైఎస్ కుటుంబంతోనే కలిసి ఉంటాం
రాజానగరం వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా వ్యాఖ్యలు.
రాజానగరం: ఎన్నికల్లో వైసీపీ పరాజయం, తన ఓటమిపై రాజానగరం వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా స్పందించారు. నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో అభివృద్ధి చేశాం. అర్హులకు పథకాల లబ్ధి నేరుగా ఖాతాల్లో జమ చేయించాం. అనునిత్యం ప్రజలతో మమేకమై వారి కష్ట సుఖాల్లో పాలుపం చుకున్నాం. చివరకు కన్నతల్లికి ఒంట్లో బాగోలేక ఆసుపత్రిలో ఉన్నా సరే ప్రజల కోసం పనిచేశా. అయినా ఇంత దారుణంగా ప్రజలు ఎందుకు ఓడిరచారో అంతుబట్టడం లేదని వాపోయారు. కాపుల కష్టాలను పట్టించుకోని నాయకులు హీరోలయిపోయారు..కూటమి హామీలకు ప్రజలు మోసపోయారా? ప్రజలతో మమేకమవడం మా తప్పా అంటూ ప్రశ్నించారు. ఏది ఏమైనా ప్రజల కోసం పనిచేస్తాం…వైఎస్ కుటుంబంతోనే కలిసి ఉంటాం. ధనుంజయ రెడ్డి లాంటి అధికారుల తీరు దెబ్బతీసిందని వ్యాఖ్యానించారు. మీకు మంచి చేసి ఉంటే నాకు ఓటు వేయమని అడిగిన దమ్మున్న నాయకుడు జగన్ మాత్రమే. దేశంలో ఏ ముఖ్యమంత్రికైనా ఇలాంటి దమ్ముందా? గెలిచినా..ఓడినా రియల్ హీరో జగన్. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా నెగ్గిన వారికి అభినందనలు తెలిపారు.