సంక్షేమం అందించే ఏకైక ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వం

– ఎమ్మెల్యే గల్లా మాధవి

గుంటూరు, మహానాడు: సంక్షోభంలోనూ సంక్షేమం, అందిస్తూ ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. మంగళవారం 36వ డివిజన్ స్తంభాలగరువు, గ్యాంగ్ కాలనీ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించారు.

ఎన్డీయే కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి గురించి ప్రజల నుండి అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే గళ్ళ మాధవి మాట్లాడుతూ… అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకువచ్చి రోజుకి వందలాది మందికి భోజన వసతి కల్పిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వందరోజుల పాలనలో ప్రజల సంక్షేమం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సింహాద్రి కనకాచారి, బండారు వెంకటేశ్వరావు, మానుకొండ శివ ప్రసాద్, కసుకుర్తి హనుమంతరావు, తావులాల్ నాయక్, సంజీవరావు కార్పొరేటర్లు బుజ్జి, కొమ్మినేని కోటేశ్వరరావు, మానం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.