– ఎమ్మెల్యే బోండా ఉమా
విజయవాడ, మహానాడు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభం అవుతుండడం శుభ సూచికమని సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యుడు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా అన్నారు. 58వ డివిజన్ సింగ్ నగర్‌లో మంగళవారం మధ్యాహ్నం 12:30 గం లకు అన్న క్యాంటీన్ దగ్గర ఉమా నాయకత్వంలో, బాలాజీ కన్స్ట్రక్షన్స్ దొడ్ల చిన్నారావు ఆధ్వర్యంలో 250 మందికి మంది పేదలకు భోజనాలు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా బోండా ఉమామహేశ్వర రావు పాల్గొని స్వయంగా భోజనాలు వడ్డించిన అనంతరం మాట్లాడారు.
సెంటర్ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయకత్వంలో దివంగత నందమూరి తారకరామారావు పేరుతో పేదలు ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు, యువత, మహిళల ఆకలి తీర్చేందుకు పౌష్టిక ఆహారం రూపంలో మధ్యాహ్నం భోజనం రూపంలో కేవలం 5.రూ లతో రోజుకి 15 రూపాయలతో భోజనం పెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీదే అని అన్నారు.
2019 నుండి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పేదల నోటి కాడ కూడుని లాగేసి, తినడానికి తిండి దొరకకుండా చేసిన అసమర్ధ పాలనతో ప్రజలకు నరకం చూపించారని విమర్శించారు. సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో ఆరు అన్నా క్యాంటీన్లు ఉండేవన్నారు. ఆగస్టు 15న తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ ను ప్రారంభించి పేదలకు అందుబాటులో మూడు పూటలా భోజనం ఏర్పాటు అవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సెంట్రల్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, పిరియ సోమేశ్వరరావు, సాంబ్రాణి అమర్నాథ్, సత్యాల చిన్నారవు, బత్తుల కొండ,పైడి శ్రీను, దాసరి ఉదయశ్రీ, దాసరి దుర్గారావు, సర్వేపల్లి అమర్నాథ్, పత్రి శ్రీనివాస్ (చిన్న), దొట్ట మురళి, పి.మురళీకృష్ణ, విరస్వామి తదితరులు పాల్గొన్నారు.