ప్రాజెక్టును గోదావరిలో ముంచేసినోళ్లు సిగ్గు లేకుండా పోలవరం గురించి మాట్లాడుతున్నారు

నిధులను దారి మళ్లించిన మీకు పోలవరం గురించి మాట్లాడడానికి అర్హత లేదు
ఏజెన్సీలను మార్చవద్దని పి పి ఏ హెచ్చరిస్తూ లేఖ రాయలేదా?
– ఢిల్లీ ఆంధ్ర భవన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు

ఢిల్లీ : ఐదేళ్లు అధికారంలో ఉండి పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచేసినోళ్లు సిగ్గు లేకుండా పోలవరం గురించి మాట్లాడుతున్నారు .తమ అసమర్ధత పాలనను కప్పిపుచ్చుకోవడానికే సమర్థవంతమైన నేటి పాలనపై జగన్ అసత్యాలు మాట్లాడుతున్నారు. పోలవరం గురించి వైసిపి మాట్లాడుతుంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు ఉంది.

2020 ఆగస్టులో వచ్చిన వరదల సమయానికి ఎగువ కాపర్ డ్యాం దెబ్బతిన్నదని హైదరాబాద్ ఐఐటీ నిపుణులు చెప్పిన మాట వాస్తవం కాదా? 2019 మే నెల నుంచి 2020 ఆగస్టు వరకు పనిచేసే ఏజెన్సీ లేకపోవడమే డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడానికి కారణమని ఐఐటి నిపుణులు చెప్పలేదా?

2019 మే నెల నుండి రెండు నెలల్లో పూర్తి కావాల్సిన కాపర్ డ్యాం ను 13 నెలలు పూర్తి చేయకపోవడమే డయాఫ్రమ్ వాల్ విధ్వంసానికి గురైందని ఐఐటీ నిపుణులు చెప్పలేదా? క్లిష్టతరమైన ప్రాజెక్టులలో ఏజెన్సీలను మార్చవద్దని పి పి ఏ హెచ్చరిస్తూ లేఖ రాయలేదా?

ఒకే పనిని రెండు ఏజెన్సీలు చేస్తే పోలవరం డ్యాంకు ప్రమాదం వస్తే ఎవరు బాధ్యత వహిస్తారని పిపిఏ మినిట్స్ లో మిమ్మల్ని హెచ్చరించలేదా? తెలుగుదేశం ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుకు 11,762 కోట్లు ఖర్చు పెడితే కేంద్రం నుంచి వచ్చిన నిధులు 6,764 కోట్లు మాత్రమే.

జగన్ ప్రభుత్వంలో పోలవరం కు 4,167 కోట్లు ఖర్చు పెడితే కేంద్రం నుంచి వచ్చిన నిధులు 8,382 కోట్లు. ఖర్చు పెట్టిన దానికంటే కేంద్రం నుంచి అధికంగా వచ్చిన 3,385 కోట్లు పోలవరం నిధులను దారి మళ్లించిన మీకు పోలవరం గురించి మాట్లాడడానికి అర్హత లేదు.

కేంద్రం నుంచి వచ్చే నిధులు కోసం చూడకుండా ఎదురు ఖర్చు పెట్టింది టిడిపి ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సైతం దారి మళ్లించిన జగన్ కు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంపై చిత్తశుద్ధి ఎక్కడ ఉంది? ఎక్స్ ఫర్ట్ కమిటీ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వకుండానే డ్రాఫ్ట్ ను ఎడిట్ చేసి తన ఫేక్ స్వభావాన్ని జగన్ మరోసారి బయట పెట్టాడు.