– ప్రధాని, కేంద్ర మంత్రులకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కృతజ్ఞతలు
విజయవాడ, మహానాడు: జాతీయ ప్రాజెక్టు, ఆంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చెల్లించాల్సిన బకాయిలతో పాటుగా, అవసరమైన నిధులను సమకూర్చి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టుకు మేలు చేస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన ఆవశ్యకతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేకమార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలను విన్నవించారని, కూటమి ఎంపీలు పార్లమెంట్‌లో ఈ ప్రాజెక్టు పూర్తి గురించి లేవనెత్తారని అన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి జలసిరులు కురిపించడానికే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.