ఆర్యవైశ్యుల సమావేశంలో ప్రత్తిపాటి పుల్లారావు
చిలకలూరిపేట, మహానాడు : కూటమి అధికారంలోకి వచ్చాక జూన్-4 తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండవ సంతకం ల్యాండ్ టైౖటిలింగ్ యాక్ట్ రద్దుపైనే చేస్తారని చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జనం భూములు, ఆస్తులను కబ్జాకోరుల పరం చేసే దొంగ చట్టంపై ఒక్క క్షణం కూడా ఉపేక్షించబోమని చంద్రబా బు స్పష్టమైన హామీఇచ్చారని గుర్తుచేశారు. ఆదివారం చిలకలూరిపేట వాసవీ గ్రాండ్స్‌లో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో లావు రత్తయ్యతో కలిసి ఆయన ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ జయరామిరెడ్డి, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకురాలు దాసరి ఉషారాణి, గోనుగుంట్ల కోటేశ్వర రావు, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.