-రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వచ్చింది
-కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
జనగాం, మహానాడు: వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం వెళుతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గురువారం జనగాం జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల నెత్తిన భస్మాసుర హస్తం పెట్టింది. రైతు రుణమాఫీ చేయలేదు. క్వింటా 500 బోనస్ సన్న రకానికని రైతులను ముంచారు. రైతు బంధు, రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఊసే లేదు. ఉద్యోగులకు కరువు భత్యాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తుంది.
పెన్షన్ సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఉద్యోగస్తుల పీఆర్సీ 2023 నుంచి పెండిరగ్‌లో ఉంటే పట్టించుకోవడం లేదు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ విషయంలో మోసం చేస్తున్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.5 వేల కోట్లు పెండిరగ్‌లో ఉన్నాయి. ఆరోగ్య శ్రీ, స్కాలర్ షిప్స్ సకాలంలో ఇచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్టం ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితికి వచ్చిందని ధ్వజమెత్తారు. ఆర్‌ఆర్ ట్యాక్స్ పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ దోపిడీ, మోసం చేస్తుందని, పట్టభద్రుల ఎన్నికల్లో గుజ్జుల ప్రేమిందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
ఖమ్మంలో విద్యాసంస్థలతో సమావేశం
పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి మద్దుతుగా ఖమ్మంలోని వివిధ విద్యాసంస్థల అధినేతలు, యాజమాన్యాలు, వైద్యులు, లాయర్స్ సంఘాలు, లెక్చరర్లు, ఉపా ధ్యాయులు, మేధావులతో సమావేశమయ్యారు. అధికారం కోసం కాదు దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలని, పెద్దల సభలో ప్రశ్నించే గొంతుకగా బీజేపీ ని చట్టసభలోకి పంపించాలని కోరారు. ఈ సందర్భంగా కాలేజీ యాజమా న్యాలకు వివిధ రకాల బిల్లులు, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు తదితర సమస్య లపై మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.