రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామి
శ్రీకాకుళం, మహానాడు : శ్రీకాకుళం జిల్లా నందిగాం అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి విచారం వ్యక్తం చేశారు. ఘటనపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకుని, ఘటనపై పూర్తిస్ధాయి ధర్యాప్తు జరపాలని మంత్రి ఆదేశించారు. ఈ సంధర్బంగా మంత్రి మాట్లాడుతూ… విద్యార్థిని ఆత్మహత్య ఘటన విచారకరమని, తన మనసును తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి తప్ప విద్యార్థులు మనోధైర్యాన్ని కోల్పోవద్దని, క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుని బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్దిని కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాడ సానుభూతి తెలిపారు.