– ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
విజయవాడ, మహానాడు: మోడీ పై ప్రజలకు ఉన్న నమ్మకమే ఎన్డీఏ కూటమి మూడోసారి విజయానికి నాంది అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో దగ్గుబాటి పురందేశ్వరి ఆధ్వర్యంలో నాలుగు జిల్లాలకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాషాయం కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమం మాకు ముఖ్యం సబ్ కా సాత్, సబ్ వికాస్ నినాదాన్ని కార్యాచరణ లో పెడతామన్నారు. ఐదేళ్లల్లో వైసీపీ పాలనలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని ఈ సందర్భంగా వైసీపీ కి చురకలు అంటించారు. స్థానిక ఎన్నికల్లో నెల్లూరులో బీజేపీ మహిళా నేత పై జరిగిన దాడి గురించి లేఖ రాసినా పట్టించుకోలేదన్నారు. ఉత్తరాంధ్రలో కరోనా సమయంలో డాక్టర్ పట్ల ఆనాటి ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఎవరూ మరువలేనిదని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు
అందుకే ప్రజలు కూటమి మీద నమ్మకంతో విజయం ఇచ్చారు. ప్రజాహిత పాలనను రాష్ట్రంలో చంద్రబాబు అందిస్తారని భావిస్తున్నానన్నారు. వర్షాల వల్ల వైరల్ ఫీవర్లు వచ్చే ప్రమాదం ఉంది. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. బీజేపీలో చేరిన వారు కూడా… పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా పని చేయాలి. పార్టీ లో చేరిన వారు పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.