సీఎం, సంబంధింత మంత్రి బాధ్యత తీసుకోవాలి
తక్షణమే నేతన్నలను ఆదుకోవాలి
బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ ఎల్.రమణ
హైదరాబాద్, మహానాడు : తెలంగాణ భవన్‌లో ఆదివారం బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ ఎల్.రమణ మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలకు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చిందని, గ్యారంటీల పేరుతో వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి నిలుపుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నేత కార్మికులు మళ్లీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చేనేత పరిశ్రమ సంక్షోభం లో కూరుకుపోవడానికి రేవంత్‌రెడ్డి సర్కార్ కారణం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వస్త్ర పరిశ్ర మపై జీఎస్టీ ఎత్తివేస్తామని చెప్పారు. పట్టించుకోలేదన్నారు.
చేనేతల ఆత్మహత్యలు..కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలు
చేనేత కార్మికుల కుటుంబాలకు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతి కుటుంబానికి రూ.50 వేల రుణం ఇచ్చారు. దసరా, బతుకమ్మ పండుగలకు మహిళలకు చీరలు ఇవ్వడం ద్వారా చేనేతల కు అండగా నిలబడ్డారు. చేనేతలకు నెలకు రూ.2 వేల పింఛన్ ఇచ్చారు. నేతన్న బీమా ద్వారా చేనేతల కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేశారు. గత నవంబరు నుంచి దాదాపు పది వేల మందికి పని లేకుండా పోయింది. ఎమ్మెల్సీగా నేను…రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వ రరావు దృష్టికి చేనేతల సమస్యలను తీసుకువెళ్లాను. చేతి వృత్తులను కాపాడలేని స్థితిలో కాం గ్రెస్ పార్టీ ఉంది.
హత్య చేశాక సంతాపసభలకు వెళ్లినట్లుంది
చేనేతల ఆత్మహత్యలు జరిగాక కాంగ్రెస్ నేతలు పరామర్శలకు వెళుతున్నారు. హత్య చేసిన వాళ్లు సంతాప సభకు వెళ్లినట్లు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను దీపాదాస్ మున్షీ, పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. దేవుళ్ళ మీద ప్రమాణాలు చేస్తూ ఓట్లు తెచ్చుకునే ప్రయత్నంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు ద్వారా చేనేతలు బుద్ధి చెప్పాలి. రాష్ట్రంలో ఉన్న చేనేతలకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంది. మా సూచనలు పట్టిం చుకుని ప్రభుత్వం స్పందించి ఉంటే ఆత్మహత్యలు జరిగేవి కావు. చేనేతల ఆకలి చావులకు సీఎం, సంబంధిత శాఖ మంత్రి బాధ్యత వహించాలని కోరారు. ప్రోక్యూర్‌మెంట్ అయిన వాటి కి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. రేవంత్ రెడ్డి బీసీలను చిన్న చూపు చూస్తున్నారు. ఆయనకు ఏ వర్గాలు అంటే ప్రేమో అందరికీ తెలుసు. కాంగ్రెస్ పాలనలో సామాజిక న్యాయం లోపించింది. వెంటనే నేతన్నలకు వర్క్ ఆర్డర్ పెంచి కేసీఆర్ హయాంలో నేతన్నలకు ప్రకటిం చిన పథకాలు, ప్రోత్సాహకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.