– థాంక్యూ సీఎం సార్ ఫర్ మెగా డీఎస్సీ..
– తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఘనస్వాగతం
గుంటూరు జిల్లా తెలుగు విద్యార్థి అధ్యక్షులు మన్నవ వంశీకృష్ణ ఆధ్వర్యంలో “థాంక్యూ సీఎం సార్ ఫర్ మెగా డీఎస్సీ” అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మెగా డిఎస్సీ పై మొట్టమొదటి సంతకం పెట్టి 16347 ఉద్యోగాల్ని ప్రకటించడం జరిగింది.గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే యువత విద్యార్థి ఎదురుచూస్తూ ఉన్నారో వారందరి కన్నీటిని తుడిచిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర ద్వారా డిఎస్సీని ప్రకటిస్తానని చెప్పి యువత, విద్యార్థులని మోసం చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే గతంలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని మరియు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్నినిర్వహించడం జరిగింది. ఇప్పుడు మన ప్రజానాయకుడు,ప్రజా పరిపాలకుడు అయినా నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ పై పెట్టి యువత విద్యార్థి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ ఉన్నాం.
అదే విధంగా నారా చంద్రబాబునాయుడు మరిన్ని ఐటి కంపెనీలు, పరిశ్రమలు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరింత నిరుద్యోగ యువతకి,విద్యార్థులకు ఉపాధి కల్పించాలని కోరుకుంటా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గడం తద్వారా చంద్రబాబు నాయుడు పై ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ యువత విద్యార్థి నమ్మకం ఉందో మనందరికీ అర్థం అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఘనస్వాగతం తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలుగు విద్యార్థి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపాటి అమృత రావు , తెలుగు విద్యార్థి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్ గౌడ్ , గుంటూరు తూర్పు తెలుగు విద్యార్థి అధ్యక్షులు నరేంద్ర , కన్నదారి హరీష్, సాయి ప్రతాప్, హరీష్ యాదవ్, ఏలేంద్ర, పవన్ కుమార్, రాహుల్ పాల్గొన్నారు.