బాధితులకు ఎలాంటి సమస్య రానీయొద్దు

– సాయంపై మంత్రి నారాయణ దిశానిర్దేశం

విజయవాడ, మహానాడు: వరద సహాయక చర్యలపై అన్ని శాఖలను సమన్వయం చేస్తూ మంత్రి నారాయణ దిశానిర్దేశం చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఉదయం నుంచి మంత్రులు, అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఆహారం, మంచినీరు పంపిణీపై ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, సీఎంవో, వైద్యారోగ్య, హోం శాఖల అధికారుల తో వరుసగా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేశారు. క్షేత్ర స్థాయిలో అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలిస్తూ వరద బాధితులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు.