విజయవాడ, మహానాడు: బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు శరవేగంగా సాగుతున్నాయి. మంత్రులు లోకేష్, నిమ్మల రామానాయుడు సారథ్యంలో రెండు గండ్లు పూడ్చివేత పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. మూడో గండి పనులు ప్రారంభమయ్యాయి. మంత్రి లోకేష్ డ్రోన్ లైవ్ ద్వారా సూచనలు ఇస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారు. గండ్ల పూడ్చివేత పురోగతిపై మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ లతో కలిసి కమాండ్ కంట్రోల్ నుంచి లోకేష్ సమీక్షిస్తున్నారు.
విరాళాలు
వరద బాధితులను ఆదుకునేందుకు దాతల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. తెనాలికి చెందిన బొమ్మినేని హాస్పిటల్ అధినేత బొమ్మినేని దుర్గారాణి రూ.15 లక్షలు, కాటూరి మెడికల్ కాలేజ్ యాజమాన్యం సిబ్బంది కలిపి రూ.10 లక్షలు, విజయవాడకు చెందిన ప్రముఖ ఎన్నారై డాక్టర్ శోభ ఆర్ పొదిల రూ. 10 లక్షలు, బీజేపీ సీనియర్ నేత పాతూరి నాగభూషణం సోదరుడు శ్రీనివాస్ రూ.5 లక్షలు, యలమంచిలి అరుణ రూ. 2,02,000, ఎం.మాధురీలత రూ.1.5 లక్షలు, పాతూరి మధుసూదన్ రావు రూ. లక్ష, కోట వెంకట భాస్కరరావు రూ. 50 వేలు, వి.రామారావు రూ.10 వేలు, సాయి ఫేస్ స్కాన్ సెంటర్ యజమాని అన్నపూర్ణ రూ. 25 వేలు, ప్రభుకుమారి రూ. 20 వేలు, కవిత రూ. 5 వేలు మంత్రి లోకేష్‌కు అందించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన దాతలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.