Mahanaadu-Logo-PNG-Large

రాష్ట్రంలో సంబరాలు చేసుకునే పరిస్థితి వచ్చింది

– టీడీపీకి మాత్రమే పింఛన్లపై పేటెంట్ ఉంది
• చరిత్రలో నిలిచిపోయే విధంగా పింఛన్ లను ఎన్టీఆర్ పరిచయం చేశారు
• ఇచ్చిన హామీల అమలుకు చంద్రబాబు అడుగులు వేయడంతో హర్షం వ్యక్తం అవుతోంది
• జగన్ రెడ్డి పింఛన్ ను 3 వేలు చేస్తానని సంవత్సరానికి రూ. 250 పెంచుతూ పింఛన్ దారులను మోసం చేశాడు
• అధికారంలో లేని మూడు నెలలతో కలిపి జూలై 1న రూ. 7000ల పింఛన్ అందించడానికి కేబినెట్ ఆమోదించడం హర్షణీయం
• పెంచిన నాలుగువేల పింఛన్ లో రూ 2,845 ను చంద్రబాబే పెంచారు. మీగిలిన వారు పెంచింది కేవలం 1100 చిల్లరే
• అన్ని హామీలు అమలు చేశానని గొప్పలు చెప్పుకుంటున్న జగన్ రెడ్డి ఏ హామీని అమలు చేశాడో చెప్పడానికి చర్చకు సిద్ధమా ?
• పదవి పోయి పదిరోజులు కూడా కాకుండానే అదిఎప్పుడు చేస్తావ్ ఇది ఎప్పుడు చేస్తావ్ అంటూ పేర్ని నానిలాంటి నేతలు నోరు పారేసుకుంటున్నారు
• అన్నప్రాసన రోజే అవకాయ పెట్టమనేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు
– మాజీ మంత్రి కె.ఎస్.జవహర్

అన్నప్రాసన రోజే అవకాయ పెట్టమనేలా వైసీపీ నేతల తీరు ఉందని.. పదవి పోయి పదిరోజులు కూడా కాకుండానే అదిఎప్పుడు చేస్తావ్ ఇది ఎప్పుడు చేస్తావ్ అంటూ పేర్ని నాని, కొడాలి లాంటి నేతలు నోరు పారేసుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి కేఎస్ జవహర్ మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

కె.ఎస్ జవహర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంబరాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు ఇచ్చిన ఐదు గ్యారెంటీలు మొదటి సంతకంతోనే అమలుపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి మాత్రమే పింఛన్లపై పేటెంట్ ఉంది. చరిత్రలో నిలిచిపోయే విధంగా పింఛన్ లను ఎన్టీఆర్ పరిచయం చేశారు.

30 రూపాయలు ఉన్న పింఛన్ అప్పటి కాంగ్రెస్ కేవలం రూ. 75 మాత్రమే పెంచారు. నాడు చంద్రబాబు రూ. 75 ఉన్న పింఛన్ ను 200 కు పెంచారు. వైసీపీ అధికారంలోకి రావడానికి రూ. 2000 ఉన్న పింఛన్ ను 3 వేలకు పెంచుతానన్న జగన్ రెడ్డి సంవత్సరానికి రూ. 250 పెంచుతూ పింఛన్ దారులను దారుణంగా మోసం చేశాడు.

సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అధికారంలో లేని మూడు నెలలతో కలిపి జూలై 1న రూ. 7000 లను పింఛన్ దారులకు అందించడానికి కేబినెట్ ఆమోదించడం హర్షణీయం. పించన్ మీద ఆదారపడిన వ్యక్తులు, మహిళలు చంద్రబాబు చేసిన పనిపై హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల స్టంట్ కోసం పింఛన్లు ఆపి వృద్ధుల మరణానికి కారణమైన పాపం జగన్ రెడ్డిని వెంటాడింది.

అన్ని హామీలు అమలు చేశానని గొప్పలు చెప్పుకుంటున్న జగన్ రెడ్డి ఏ హామీని అమలు చేశాడో చెప్పడానికి చర్చకు సిద్ధమా ? నేను చర్చకు సిద్ధం. పెంచిన నాలుగువేల పింఛన్ లో రూ 2,845 ను చంద్రబాబే పెంచారు. మీగిలిన వారు పెంచింది కేవలం రూ. 1100 చిల్లరే.

సామాజిక బాధ్యతతో ఒంటరి మహిళలకు పింఛన్ ఇచ్చి వృద్ధులకు పింఛన్ పెంచి ఆదుకున్న మహనీయుడు చంద్రబాబు. రాష్ట్రాభివృద్ధికోసం తపిస్తున్న నాయకుడు చంద్రబాబు. అలాంటి వ్యక్తికి ప్రజల సహకారం, దీవెనలు అవసరం. పదవి పోయి పదిరోజులు కూడా కాకుండానే అదిఎప్పుడు చేస్తావ్ ఇది ఎప్పుడు చేస్తావ్ అంటూ పేర్ని నానిలాంటి నేతలు పేలుతున్నారు.

వైసీపీ నేతలకు మొదడు పాడై ఏమి మాట్లాడుతున్నారో తెలియడంలేదు. కుటుంబాలుకు వృద్ధులు బరువుకాదు బాధ్యత అనేది తెలియజేసేందుకే పింఛన్ ను అందజేస్తున్నారు. 2014 జూన్ నాటికి 39 లక్షలు ఉన్న పింఛన్ లను చంద్రబాబు 54,25000లకు పెంచారు. జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఎక్కడా పింఛన్ లు పెంచిన దాఖలాలు లేవు.

డప్పుకళాకారులు, చర్మకారులు, చెప్పులు కుట్టేవారు గౌరవ ప్రదంగా బ్రతికేలా పింఛన్ ఇచ్చి ఉదారతను చాటుకున్న గొప్ప వ్యక్తి చంద్రబాబు. 1వ తారికే సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పింఛన్లు పంపిస్తాం. ప్రతి నెల నాలుగువెల పింఛన్ ఇంటికి వస్తుంది. ఇచ్చి హామీలు అమలు చేయడం చంద్రబాబుకే సాధ్యం. చంద్రబాబు పాలనలో స్వర్ణయుగం మొదలవుతోంది.

ఒకవైపు ఆదాయం పెంచుతూనే సంక్షేమానికి పెద్దపీట వేయబోతున్నాం. పేదలపట్ల, వృద్ధుల పట్ల, వితంతువుల పట్ల చంద్రబాబుకు ఏవిధమైన వైఖరి ఉందో పెంచిన పింఛనే తెలియజేస్తుంది. అన్నప్రాసన రోజు అవకాయ పెట్టమనేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. పేర్నినాని, కొడాలి నాని, జగన్ రెడ్డి లు మాత్రమే సైకోలు కాదు అనుచరులు కూడా అలాగే ఉన్నారు బెంగుళూరు ఉదంతమే ఉదాహరణ.

ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తాం. సంక్షేమ రాజ్యాన్ని తీసుకొస్తాం. జగన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రాలేడని వాళ్ల కార్యకర్తలే చెబుతున్నారు. తన అనుంగులకు బిల్లులు క్లియర్ చేసి చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఆపారు. అందుకే రాళ్లతో దాడి చేశారు. జగన్ రెడ్డి వారినుండి తప్పించుకోవడానికి బెంగళూరు పారిపోయాడు. జగన్ రెడ్డికి మొదటి నుండి భయమే… నేడు సెంట్రల్ జైల్ కు కూడా లేని సెక్యూరిటీ తన ఇంటికి పెట్టుకున్నాడు.. హెలిప్యాడ్ కూడా ఇంట్లోనే ఉంది.

కోడికత్తి డ్రామాలు, జగన్ రెడ్డి వలన ఇబ్బంది పడిన వ్యక్తులతో ఏర్పడిన భయం వలన తనకు అభద్రత ఉంటే ఉండొచ్చు అందుకే 980 మందికి సెక్యూరిటీని పెట్టుకున్నారు. ఒక ప్రధానికి కూడా ఇంత సెక్యూరిటీ ఉంటుందో లేదో తెలియదు. చేసిన నేరాలు వెంటాడతాయన్న భయంలో జగన్ రెడ్డి ఉన్నాడు.