-పాడి పరిశ్రమను నాశనం చేశారు
-వైసీపీకి ఎందుకు ఓటేయాలో ఆలోచించండి
-దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి
దర్శి, మహానాడు: దర్శి మండలం చెరువుకొమ్ముపాలెం, పోతకమూరు, తూర్పు వీరాయపాలెంలో కూటమి ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లేవు…పాలకు మద్దతు ధర లేదు… నిత్యావసరాల ధరలు మాత్రం ఆకాశాన్ని అంటాయి… మరి ఎందుకు వైసీపీకి ఓటేయాలని ప్రశ్నించారు. మిరప పంటకు కనీసం మద్దతు ధర కూడా ఈ ప్రభుత్వం అందించలేకపోతుందని తెలిపారు.
రైతుకు పెట్టుబడి లక్షల అవుతుంటే క్వింటా ధర కేవలం 15000 మాత్రమే వస్తుందన్నారు. అదేవిధంగా వడ్ల ధరలు 1500 లోపు మాత్రమే ఉన్నాయన్నారు. మనం కొనాలంటే కొరివి…అమ్మాలంటే అడవిలాగా నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం ఆకాశాన్ని అంటాయని ధ్వజమెత్తారు. ఇక పాడి పరిశ్రమను ఈ వైసీపీ ప్రభుత్వం నాశనం చేసి అమూల్ డెయిరీకి పాలను ధారాదత్తం చేసి కనీస మద్దతు ధర లేకుండా నడ్డి విరిచారని విమర్శించారు. ఈ ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు చిట్టె వెంకటేశ్వర్లు, చెరువుకొమ్ముపాలెం, పోతకమూరు, తూర్పు వీరాయపాలెం గ్రామాల టీడీపీ నాయకులు, మహిళలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.