కృష్ణా జిల్లాలో ఆ పిచ్చికుక్కలను వదిలేది లేదు

తెలుగుదేశం పార్ట్‌ 1 చూశారు..ఇక పార్ట్‌ 2 చూస్తారు
ఇక జగన్‌ జీవితం జైలుకే… సజ్జల కూడా త్వరలోనే వెళతాడు
బెట్టింగ్‌ల కోసం చేసిన ఫేక్‌ సర్వే..ఆరా మస్తాన్‌ సర్వే
జగన్‌, కేటీఆర్‌ కలిసి పోటీ చేసినా లోకేష్‌ మెజార్టీ రాలేదు
బీసీల వ్యతిరేకి జగన్‌..ఇక రాజకీయాలకు స్వస్తి పలకాల్సిందే
చంద్రబాబును విమర్శించారు..అందుకే ప్రతిపక్ష హోదా దక్కలేదు
టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శలు

విజయవాడ: ఏపీలో ఎన్నికలకు సంబంధించి ప్రజల తీర్పు ఎలా ఉందో చూశారు.. ఈ ఎన్నికల ఆరా మస్తాన్‌ సర్వే ఏమైందో చూశారు.. కేవలం బెట్టింగ్‌ల కోసం జగన్‌ అండ్‌ కో చేసిన ఫేక్‌ సర్వే అని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. గురువారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా వేదిక కూల్చిన దగ్గర నుంచి టీడీపీపై పెట్రేగిపోయిన వైసీపీ నాయకులను వాళ్ల నియోజకవర్గాలలో వాళ్ల కార్యకర్తలే తరిమికొట్టారని తెలిపా రు. చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించిన కృష్ణా జిల్లాలో ఉన్న పిచ్చి కుక్కలను మాత్రం వదిలేది లేదని హెచ్చరించారు. చంద్రబాబును అసెంబ్లీలో వైఎస్సార్‌ ఫినిష్‌ చేస్తానని అన్నాడు. కానీ భగవంతుడు ఆయననే లేకుండా చేశాడు.

జగన్‌ కూడా అనేక వ్యాఖ్యలు చేశాడు. దేవుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాడని ఎద్దేవా చేశారు. కేంద్రంలో చంద్రబాబు కీ రోల్‌ పోషిస్తున్నాడు.. మాకు అంతకంటే ఆనందం లేదన్నారు. పవన్‌ను మూడు పెళ్లిళ్లు అని విమర్శించారు.. ఇప్పుడు జగన్‌కు రంకు మొగుడు అయి కూర్చున్నాడని వ్యాఖ్యానించారు. జగన్‌, కేటీఆర్‌ ఇద్దరూ కలిసి పోటీ చేసినా లోకేష్‌కు వచ్చిన మెజార్టీ రాలేదు. మంగళ గిరి నియోజకవర్గంలో బీసీలంతా లోకేష్‌కు బ్రహ్మరథం పట్టారు. జగన్‌ బీసీల వ్యతిరేకి అని…ఇక ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిందేనన్నారు. ఇక జగన్‌ జీవితం జైలుకేనని వ్యాఖ్యానించారు. జగన్‌ మూడు జన్మలెత్తినా సరే తరగని శిక్షలు పడతాయి. త్వరలోనే సజ్జల రామకృష్ణారెడ్డి జైలుకు వెళతా డని తెలిపారు. 2024 జూన్‌ 4న తెలుగుదేశం పార్‌ 2 వచ్చింది. ఇప్పటివరకూ ఉన్నది పార్ట్‌ 1. ఇంకో 45 సంవత్సరాలు టీడీపీకి తిరుగులేదని చెప్పారు.