తిరుపతి, మహానాడు: తిరుపతి విమానాశ్రయానికి బెదిరింపు లేఖ వచ్చింది. అగంతకుడు ఈ-మెయిల్ ద్వారా లేఖను పంపాడు. సీఐఎస్‌ఎఫ్ అధికార వెబ్‌సైట్‌కు లేఖ అందింది. అయితే, ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు ఈ సంగతిని గోప్యంగా ఉంచి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ-మెయిల్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.