తిరుమల లడ్డూ దోషులను కఠినంగా శిక్షించాలి

– పాదయాత్రలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ

సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నుండి కూరగాయల మార్కెట్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర కార్యక్రమం ప్రారంభించి, అనంతరం సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. వెంకటేశ్వర స్వామి వారి మహాలడ్డు ప్రసాదంలో వినియోగించిన నేతిలో జంతువులు కొవ్వు పదార్థాలు వాడి హిందువులు మనోభావాలు దెబ్బతీసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. స్వామివారి సేవలను వ్యాపార ధోరణిలో ఆలోచించి స్వామి వారి దేవస్థాన పాలనను అన్యమతస్తులు నిర్వహించి అపవిత్రం చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో భక్తులు, వివిధ హోదాలో ఉన్న కూటమి రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.