తిరుపతి బీజేపీ నేత వరప్రసాద్‌ కంటతడి

తిరుపతి: బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వరప్రసాద్‌ కంటతడి పెట్టారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. చాలాతక్కువ మెజారిటీతో ఓడిపోయా. గతంలో జగన్‌, విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలకు సలహాలు ఇచ్చినా పెడచెవిన పెట్టారు. గడిచిన ఐదేళ్లలో ప్రజాస్వామ్యం లేదు. అరాచక పాలన నుంచి కాపాడుకోవడానికి బీజేపీలో చేరినట్లు వ్యాఖ్యానించారు. ఏ సామాజిక వర్గానికి మోదీ, బీజేపీ అన్యాయం చేయలేదని, ఏపీకి ప్రత్యేక హోదాను ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు.