తిరుపతిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలి

– కేఏ పాల్ డిమాండ్

శ్రీవారి లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుపతిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ డిమాండ్ చేశారు. లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని తాను కోర్టులో పిల్ వేసినట్లు తెలిపారు.

లేకపోతే ఇటలీ ప్రభుత్వం వాటికన్ సిటీని దేశంగా ప్రకటించినట్లు, 34లక్షల మంది ప్రజలున్న తిరుపతిని ప్రత్యేక దేశంగా గుర్తించాలని డిమాండ్ చేశారు.