విలాసవంతమైన ప్యాలెస్ లో నాటి సీఎం జగన్
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
మంగళగిరి, మహానాడు: జగన్ రెడ్డి రాష్ట్రంలో బురద రాజకీయం చేస్తున్నారు… జగన్ బెంగళూరు ప్యాలస్ లో ఉంటూ పంచభక్ష్య పరమాన్నాలు తింటూ.. విజయవాడలో వరద బాధితుల మధ్య మోకాళ్ళ లోతులో పర్యటిస్తూ.. బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్న చంద్రబాబును విమర్శించడం జగన్ దగుల్బాజీ తనానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఈ మేరకు ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బుడమేరు వరదలు రావడానికి కారణం జగనే అని రాష్ట్ర ప్రజలు అంటున్నారు.. దానికి సమాధానం చెప్పే దమ్ముందా.. చంద్రబాబు నాయుడు రోజుకు 22 గంటలు పని చేస్తూ.. గంట, రెండు గంటలు మాత్రమే నిద్రపోతున్న దార్శకుని చంద్రబాబును జగన్ విమర్మిస్తున్నారు… అది నోరా-తాటి మట్టా అని అన్నారు. పాస్పోర్ట్ అనుమతి రాలేదు గనుక తప్పనిసరి పరిస్థితులల్లో గంటా, రెండు గంటలు జగన్ బాధితులను పరామర్శించారు.
లండన్ వెళ్ళి కూతురుని పలకరించటానికి ఐదు సంవత్సరాల పాస్ పోర్ట్ కావాలని ఒత్తిడి చేయడానికి అసలు కారణం ఏంటి? పాస్ పోర్టు అనుమతిపై జగన్ వ్యవహరిస్తున్న తీరును చూస్తే అనుమానం కలుగుతోంది. జగన్ లండన్ వెళ్లితే తిరిగి వస్తారని గ్యారెంటీ లేదు. విజయ మాల్యా, నీరజ్ మోడీ తరహాలో లండన్ లోనే జగన్ స్థిరపడిపోవాలని అనుకుంటున్నావా..? నిన్న (శనివారం) బెంగళూరు తన రాజమహల్ లో స్థానిక కాంగ్రెస్ నాయకులకు విందు ఇచ్చి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేసిన విషయం వాస్తవం కాదా..! మీకు ధైర్యం ఉంటే కాంగ్రెస్ నాయకులతో ఏమి మాట్లాడారో చెప్పండి.. జగన్ ‘‘ఇండియా కూటమి’’లో చేరడానికే బెంగుళూరులో కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు.
అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడానికి కారణం జగనే.. ఇసుక మాఫియా లబ్ది కోసమే 33 మంది చనిపోవడానికి జగన్ కారకుడైయ్యాడు. అన్నమయ్య వరదలల్లో గిరి ప్రసాద్ అనే పూజారి కుటుంబానికి చెందిన 9 మంది చనిపోవడానికి జగన్ అసమర్ధతే కారణం. ప్రకాశం బ్యారేజీ గేట్లు దెబ్బతినడానికి కారణం మీరు కాదా..? బ్యారేజీ గేట్లను 4 పడవలు ఢీ కొట్టడంలో జగన్, సజ్జల కుట్ర ఉంది. ఆ పడవలు వైసీపీ నాయకులు మాజీ ఎంపీ, సురేష్, తలశిల రఘురాం అనుచురులవే అని బయట పడింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేసి కుట్ర వెలికి తీయాలి.
విజయవాడలో వచ్చిన వరదలకు అనేక మంది నాయకులు, హీరోలు, సామాన్య ప్రజలు విరాళాలు అందించారు. వరదల్లో ఇంత నష్టం జరిగిన రూ.లక్షల కోట్లు సంపాదించిన జగన్ కోటి రూపాయలు విరాళం ఇవ్వటం.. అది కార్యకర్తల ద్వారా పంపిణీ చేయడం హాస్యాస్పదం. అనేక కంపెనీలు కలిగిన జగన్.. ఒక్కొక్క కంపెనీ చొప్పున రూ.కోటి ఇవ్వలేరా..? బురద రాజకీయం చేస్తున్న జగన్ కు రాష్ట్ర ప్రజలు సరైన సమాధానం చెప్పారు. చంద్రబాబు 9 రోజుల నుండి కలెక్టర్ కార్యాలయంలోనే ఉండి ఆయన చేస్తున్న పని తీరును కేంద్ర మంత్రులతో సహా అభినందిస్తున్నారు. వైసీపీ నాయకులకు ధైర్యం ఉంటే ప్రజా క్షేత్రంలోకి రావాలని వర్ల రామయ్య సవాల్ చేశారు.