శ్రీశైలంలో ట్రాఫిక్‌తో భక్తులకు నరకం

వేసవి సెలవుల్లో యాత్రికులతో పెరిగిన రద్దీ
టోల్‌గేట్‌ మలుపు దగ్గర బారులు తీరిన వాహనాలు
సమస్య పరిష్కరించాలని దేవస్థాన అధికారులకు వినతి

శ్రీశైలం : ద్వాదశ జ్యోతిర్లంగ క్షేత్రమైన శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ పెరి గింది. ఆదివారం, వేసవి సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు పొందిన భక్తులు మల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. సాధారణ భక్తులు స్వామి వారి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో టోల్‌గేట్‌ మలుపు వద్ద ట్రాఫిక్‌ సమస్య ఏర్పడిరది. పెద్దఎత్తున వచ్చిన వాహనాలు శివపార్వతుల విగ్రహాల వద్ద నిలిపివేయడంతో ఆలయానికి వచ్చి తిరిగి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రద్దీ రోజుల్లో ట్రాఫిక్‌ సమస్యను చక్కదిద్దడంతో పాటు, సమస్యలు తలెత్తకుండా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.