వినుకొండ: పట్టణ టీడీపీ అధ్యక్షుడు పఠాన్ ఆయూబ్‌ఖాన్ ఆధ్వర్యంలో వినుకొండ టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొని నివాళులర్పించారు. ఈ కార్యక్ర మంలో తెలుగుదేశం పార్టీ వినుకొండ పట్టణ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జి.వి.ఆంజనేయులు దంపతుల నివాళి
వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ఎన్టీఆర్ 101వ జయంతి సంద ర్భంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో సతీమణి లీలావతితో కలిసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ సేవలను గుర్తుచేసుకున్నారు.