చిన నారాయణమ్మకు ఘన నివాళులు

చిలకలూరిపేట, మహానాడు: ప్రత్తిపాటి చిన నారాయణమ్మ సంస్మరణ సభ చిలకలూరిపేట ప్రత్తిపాటి గార్డెన్స్‌లో బుధవారం జరిగింది. సంస్మరణ సభకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఇటీవల అనారోగ్యంతో చిన నారాయణమ్మ మృతి చెందిన సంగతి తెలిసిందే. దశ దినకర్మ సందర్భంగా సంస్మరణ సభ ఏర్పాటు చేయగా హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు… చిన నారాయణమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు, కన్నా లక్ష్మీనారాయణ, జీవీ ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.