పండిట్ దీన్ దయాళ్ కు ఘన నివాళులు

విజయవాడ, మహానాడు: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్ దయాళ్ జీ జయంతి బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి హాజరై, ఆయన చిత్రపటానికి పూలు వేసి, ఘన నివాళుర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీ ఏకాత్మతామానవతావాదాన్ని ప్రతిపాదించిన మహనీయుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని తెలిపారు. దేశ సంస్కృతి ఆధారంగా పాలనా విధానాలను ఆయన ప్రతిపాదించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీ భావజాలాన్ని బీజేపీ పుణికి పుచ్చుకుందని, అందువల్ల అంత్యోదయ సిద్దాంతం ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీ ఆలోచనలకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తారన్నారు. నేడు రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు నిర్వహించాలని పురంధేశ్వరి పిలుపు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ మీడియా రాష్ట్ర ఇంఛార్జి పాతూరి నాగభూషణం, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, పార్టీ రాష్ట్ర కోశాధికారి కందుకూరి సత్యనారాయణ, ఎన్టీఆర్ జిల్లా పార్టీ ఇంఛార్జి బ్రహ్మం, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, మాదల రమేష్, తదితరులు పాల్గొన్నారు.