ఏసీఏ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని ఏకగ్రీవ ఎన్నిక

విజయవాడ, మహానాడు: ఏసీఏ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు కేశినేని శివనాథ్ ప్యానల్ ఎన్నికైనట్టు ఆర్వో నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా కేశినేని ఏమన్నారంటే.. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం శుభపరిమామం.. తొలి నిర్ణయంగా సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం అందజేస్తా… రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో క్రికెట్ కు వసతులు కల్పిస్తాం… ఇప్పటివరకు విశాఖ ఒక్కటే అంతర్జాతీయ మ్యాచ్ లకు వేదికగా ఉంది. మంగళగిరి, కడపలోను అంతర్జాతీయ మ్యాచులకు కృషి చేస్తాం.